Ration Card transaction status check online in telangana State

Ration Card transaction status check online in telangana State: మీ రేషన్ కార్డు Transaction details ఇలా Check చేసుకోండి: ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరిగిన విషయం మనకు తెలిసిందే అయితే ఆగస్టు మూడో తారీకు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన వారికి కూడా రేషన్ అందజేయనున్నారు.మీకు కొత్తగా రేషన్ కార్డు అప్రూవ్ అయినట్లయితే మీయొక్క రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివినట్లయితే మీరు తెలుసుకోవచ్చు.
 
కొత్తగా అప్రూవ్ అయిన వారే కాకుండా పాత రేషన్ కార్డు కలిగిన వారు కూడా మీయొక్క రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ని చెక్ చేసుకోవచ్చు. అంటే, మీ రేషన్ కార్డు మీద బియ్యం ఈ నెల ఎవరు తీసుకున్నారు, ఏ టైం కి తీసుకున్నారు, ఏం ఏం తీసుకున్నారు, అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు.
మీ రేషన్ కార్డ్ ట్రాన్సక్షన్ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే,
 

Step 1: ముందుగా Browser లో epds.telangana.gov.in అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఆహారభద్రత కార్డు తెలంగాణ ప్రభుత్వం అని మెయిన్ web-portal మనకి ఓపెన్ అవుతుంది.

epds telangana website

Ration Card transaction status check online in Telangana State



Step 2: ఈ పోర్టల్ లో లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (Electronic point of sale portal[epos])అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది.

electronic point select




epos transaction


Step 3: ఇక్కడ లెఫ్ట్ సైడ్ రిపోర్ట్ కింద రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పైన క్లిక్ చేయండి.

ration card transaction


Step 3: నెక్స్ట్ పేజ్ లో Ration card Transactions అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ Month ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఆ యొక్క Month అలాగే Year సెలెక్ట్ చేసుకొని మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.

Ration card Transactions


మీయొక్క రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎంటర్ చేసిన రేషన్ కార్డు నెంబర్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఓపెన్ అయిపోతాయి అంటే, ఈ రేషన్ కార్డు నెంబర్ కు సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లు అలాగే వారి యొక్క ఆధార్ కార్డు నెంబరు అలాగే ఈ ఆధార్ కార్డు యొక్క స్టేటస్ ఏంటి అనేది మనకి పూర్తిగా కనిపిస్తుంది. 


అలాగే మన రేషన్ కార్డు యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా మనకి కనిపిస్తాయి. అసలు మనము ఎంచుకున్న నెల యొక్క రేషన్ ఏ టైం కి తీసుకున్నాము ఏ రోజు తీసుకున్నాము, ఎవరి బయోమెట్రిక్ ఉపయోగించి తీసుకున్నాము, ఏమేం సామాగ్రి తీసుకున్నాము అంటే బియ్యము, గోధుమలు ఇలా మనము ఏం సామాగ్రి తీసుకున్నాము, ఎంత తీసుకున్నాము,ఎంత డబ్బు కట్టాము అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది.


ఈ విధంగా మనము మన యొక్క రేషన్ కార్డు ట్రాన్సాక్షన్ వివరాలు సులభంగా ఆన్లైన్ ద్వారా మనము తెలుసుకోవచ్చు.

కింద కనిపిస్తున్న వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు.

 

Ration Card transaction status check online in Telangana State

0/Post a Comment/Comments

Previous Post Next Post