తెలంగాణలో రైతు బీమా పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం పట్టాదారులకుమరొక అవకాశాన్ని కల్పించారు.

‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని కొత్త పట్టాదారుడు అంటే కొత్తగా పాసుపుస్తకం తీసుకున్నవారు రైతు బీమా కి అప్లై చేసుకోవడానికి ఈ నెల 11వ తేదీ వరకు అవకాశం ఉంది .ఈ రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పాస్ పుస్తకం కలిగి ఉన్నవారు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన రైతులు మాత్రమే అర్హులు అయితే 14-8-1962 తేదీ నుంచి 14-8-2003 మధ్య జన్మించిన పట్టాదారు మాత్రమే
ఈ రైతు బీమా పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ రైతు బీమా పథకానికి అప్లై చేసుకోవడానికి నేరుగా మనకి అవకాశం లేదు.
మన దగ్గరలో ఉన్న ఏఈవో దగ్గరికి వెళ్లి మనం దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం పట్టాదారు పాసుపుస్తకం పట్టాదారు యొక్క ఆధార్ కార్డు అలాగే నామిని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ను తప్పనిసరిగా సమర్పించాలి.
మనము ఈ సంవత్సరం ఈ రైతు బీమా కి దరఖాస్తు చేసుకోకపోతే మళ్లీ ఇంకొక సంవత్సరం వరకు ఆగాల్సి ఉంటుంది.కావున ఈ నెల 11 వ తారీకు వరకు
ఈ రైతు బీమా పథకానికి అర్హత కలిగిన వారు తప్పక అప్లై చేసుకోండి.
కింద కనిపిస్తున్న వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు.