
Baal Aadhar Card for Children - How to Apply , Eligibility & Application Procedure
- ఈ చిన్న పిల్లల ఆధార్ కార్డు ని బాల ఆధార్ అని అంటారు.
- ఈ బాల ఆధార్ మనకి నీలి రంగులో ఉంటుంది.
- ఈ చిన్న పిల్లల ఆధార్ కార్డు ఐదు సంవత్సరముల వరకు పనిచేస్తుంది
- మీ పిల్లలకీ 5 ఏళ్ల వయసు దాటిన తర్వాత పిల్లల ఆధార్ కార్డు కు బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
- మనము ఈ బాల ఆధార్ కార్డు అప్లై చేసినప్పుడు అంటే ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ కార్డు అప్లై చేసినప్పుడు ఫింగర్ప్రింట్ రావు కాబట్టి బయోమెట్రిక్ అప్డేట్ చేయరు అప్పుడు తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ వివరాలతో లింక్ చేస్తారు.
- మీ పిల్లలకి బాల ఆధార్ అప్లై చేసినట్టయితే తప్పనిసరిగా మీ పిల్లల వయస్సు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి లేదంటే ఈ బాల ఆధార్ పనిచేయదు.
- ఈ బాల ఆధార్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ పిల్లలను తీసుకొని మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కి వెళ్లి అక్కడ ఎన్రోల్మెంట్ ఫామ్ ని ఫీల్ చేసి అలాగే మీ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికెట్ మరియు తండ్రి లేదా తల్లి యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి.
- అయితే ఈ బాల ఆధార్ అప్లై చేసేటప్పుడు పిల్లల యొక్క బర్త్ సర్టిఫికెట్ మరియు తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం మనం ఒరిజినల్ తీసుకు వెళ్ళవలసి ఉంటుంది అక్కడ మన పిల్లలకు బయోమెట్రిక్ రావు కాబట్టి పిల్లల్ని ఫోటో మాత్రమే తీసుకొని ల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ కార్డు తో లింక్ చేస్తారు
- మీ పిల్లలకి బాల ఆధార్ అప్లై చేసిన వారు ఐదు సంవత్సరాల తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేసేటప్పుడు పిల్లల యొక్క బర్త్ సర్టిఫికెట్, స్కూల్ బోనఫైడ్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది పిల్లల యొక్క బోనఫైడ్ లేకపోతే మళ్లీ తల్లిదండ్రి యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళువచ్చు.
- ఐదు సంవత్సరముల తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేసిన వారు మరల 15 సంవత్సరముల తర్వాత ఆధార్ కార్డు కు అప్లై చేసుకోవాలి.
Aadhaar Card Official Website : https://uidai.gov.in/
కింద కనిపిస్తున్న వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు.
Post a Comment