ప్రాణం మీదకి తెచ్చుకున్న గార్ధభం – కుక్క కథ

ప్రాణం మీదకి తెచ్చుకున్న గార్ధభం – కుక్క కథ: శివాపురం అనే గ్రామంలో ఒక చాకలి నివసిస్తుండేవాడు . వాడి దగ్గర గార్ధబం , కుక్క రెండూ ఉండేవి. చాకలి కనుక గర్ధబాన్ని బట్టలు మోయడానికి ఉపయోగించుకునేవాడు. అంతేకాకుండా మంచి తిండి కూడా పెట్టేవాడు. కాని కుక్కను చూడగానే ఎంతో అసహ్యించుకునేవాడు.

ప్రాణం మీదకి తెచ్చుకున్న గార్ధభం – కుక్క కథ

ఇవి కూడా చదవండిఅనగనగా ఒక ఊరిలో 🔪 

‘ఛీ దీన్ని అనవసరంగా పెంచుతున్నాను. దీనివల్ల నాకు తిండి దండగే తప్ప మరే ప్రయోజనం లేదు. దీనికి ఏ జన్మలోనో ఋణపడి వుంటాను. అందుకే ఈ జన్మలో తెరగా తిండి పెడుతున్నాను’ అనుకునేవాడు. ఉపయోగం లేని దానికి తిండి ఎందుకని పాచిపోయిన అన్నాన్ని కుక్కకి వేస్తుండేవాడు. దానితో ఆ కుక్క గార్ధభాన్ని చూస్తే మహా అసూయగా వుండేది.

ఈ గార్ధభం చేసే పనేముంది… పొద్దున్నా, సాయంత్రం కాసిన్ని బట్టలను చెరువుకు మోసుకెళ్ళడం, తీసుకురావావడం మిగిలిన సమయాలలో అంతా తీరికే. మరి నేను పగలంతా కాచుకుని ఉండాలి. రాత్రిళ్ళు మేలుకొని ఉండాలి. అటువంటి నన్ను నానా మాటలు అంటూ నా కడుపు మాడుస్తున్నాడు. వీడికి, వీడి గార్దబానికి ఏదో ఒకరోజు మూడక పోతుందా! అనుకుంటూ వుండేది.

ఒక నాటి రాత్రి ఒక చోరుడు ఆ ఇంట్లో ప్రవేశించి విలువైన బట్టలను మూటగట్టుకోసాగాడు. ఇది గార్ధభం, కుక్క రెండూ గమనించాయి. కుక్క తనకు ఏమాత్రం పట్టనట్లు ఊరుకుంది.

అయ్యో! మన యజమాని సొమ్మును ఎవడో చోరుడు తస్కరించుకుపోతున్నాడు. నీవు మొరగకుండా ఉన్నవేంటి? త్వరపడు, లేకపోతే వాడు సొమ్ముతో సహా పారిపోతాడు” అంది గార్ధభం. కుక్క చిరకుపడుతూ నేను అరవను “ఇన్నాళ్ళు నాకు సరిగ్గా తిండి పెట్టనందుకు వాడికి ఈ శాస్తి జరగవలసిందే, నా కడుపు మాడ్చిన పాపం ఉరికేపోతుందా!” అంది ఉక్రోషంగా.

అయ్యో నా యజమాని సొమ్ము పోతుందే. ఈ కుక్కకి నా మాటలు బుర్రకు ఎక్కవు. నేనే గట్టిగా అరచి నా యజమానిని నిద్రలేపుతాను అనుకుని గార్ధభం గట్టిగా ఒండ్ర పెట్టింది. గార్ధభం ఒండ్ర విన్న దొంగ మూటతో సహా గోడ దూకి పారి పోయాడు.

చాకలి నిద్రలోంచి దిగ్గున లేచి “దీని దుంప తెగ! బాగా తిండిపెడితే అరగక ఇలా అరుస్తున్నట్లుంది. దీని సంగతి ఇప్పుడే చెబుతా” అనుకుంటూ దుడ్డు కర్ర పట్టుకొని వచ్చి ఇష్టం వచినట్లు వానిని బాదసాగాడు. గార్ధభం యజమాని చేతుల్లో దెబ్బలు తిని మూలుగుతూ క్రింద పడి మరణించింది.

మరిన్ని కథలు కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మా వెబ్‌సైట్‌లో కథలు ప్రచురించడానికి మీకు ఆసక్తి ఉందా? వెంటనే మాకు మెయిల్ చేయండి : districtsinfo.com@gmail.com