రోజ్ వాటర్‌తో అందానికి మెరుగులు || rose water benefits

రోజ్ వాటర్‌తో అందానికి మెరుగులు || rose water benefitsు : ప్రతి అమ్మాయి అందంగా ఉండాలని కోరుకుంటుంది. అలా కోరుకునే వారింట్లో రోజ్ వాటర్‌ తప్పకుండా ఉండాలి. రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. రోజ్ వాటర్ నిగారింపుని తెస్తుంది. ఎంతో డబ్బులు ఖర్చుబెట్టి టోనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములు వంటివి వాడడంకన్నా రోజ్ వాటర్ వాడితే చాలు. మీ అందం మరింత నిగారిస్తుంది. పైగా ఇది చాలా తక్కువ ధరలో కూడా లభిస్తుంది. ఇప్పుడు రోజ్ వాటర్ ఉపయోగాలు తెలుసుకుందాం..

రోజ్ వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య కళ్ల కింద నల్లటి వలయాలు. గులాబీ నీళ్లలో ముంచి దూదిని కళ్ల కింద తరచూ పెట్టుకుంటే ఆ వలయాలు ఇట్టే మాయమవుతాయి.

rose water benefits
       

Rose water benefits



రోజంతా బయటి పనులతో బిజీగా తిరగడం వల్ల చర్మం వడలిపోతుంది. కాలుష్యం వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. ఫేస్‌వాష్ చేసుకున్నా మురికి వదలదు. అందుకే ముఖాన్ని శుభ్రం చేసుకుని రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ఫేస్‌ను తుడిస్తే చర్మంపై పేరుకున్న వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

తలలో చుండ్రు తగ్గాలంటే తలకి స్నానం చేశాక ఓ మగ్గు నీటిలో రోజ్ వాటర్ కలిపి మాడుకి తగిలేలా పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

ఎండలో బాగా తిరిగితే చాలు ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. అలాంటప్పుడు రోజ్ వాటర్‌లో కీరదోస రసం, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంలో దూది ముంచి మొత్తం శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ట్యాన్ పోతుంది. అంతేకాదు మొటిమలున్న వారు రోజూ గులాబీ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మరవద్దు.

Rose water benefits

0/Post a Comment/Comments

Previous Post Next Post