
Immunity Boosting Food for Kids
1) పెరుగు :
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలని తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్దిగా ఉంటుంది. కానీ పెరుగును చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా చిన్నారులకు నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దృఢంగా చేస్తుంది. అందుకే పెరుగును ప్రతి రోజూ ఒక కప్పు తినిపించాలి. పెరుగు అనేక వ్యాధుల లక్షణాలను, మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.
2) బాదం పప్పు :
బాదం పప్పులో విటమిన్ ఇ, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల అభివృద్ధికి, పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఎదుగుతున్న పిల్లలకు ఇవి చాలా అవసరం. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు ఇవ్వడం వల్ల మీ పిల్లల శరీరానికి చాలా మంచిది. దీని వల్ల పిల్లలకి కావాల్సిన పోషకాలన్ని అందుతాయి.
3) సిట్రస్ ఫ్రూట్స్ :
ఆరెంజెస్, నిమ్మరసం, గ్రేప్ ప్రూట్స్, బెర్రీస్ ఈ పండ్లు అన్నిటిని కూడా సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. ఇవి శరీర ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడుతాయి. సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ సితో పాటు ముఖ్యమైన న్యూట్రీషన్స్ కూడా ఉంటాయి. విటమిన్ సి వ్యాధుల భారిన పడకుండా రోగనిరోధకతను పెంచడానికి, వ్యాధులతో పోరాడటానికి సాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ సంక్రమణలో పోరాడటానికి సాయపడుతుంది. అందుకే మీ పిల్లల ఆహారంలో సిట్రస్ ఫ్రూట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
4) సన్ ఫ్లవర్ విత్తనాలు :
పొద్దు తిరుగుడు విత్తనాలు పిల్లలకు సరైన ఆరోగ్యకరమైన స్నాక్స్. వీటిలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని పిల్లలకు అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. దీని వల్ల వారికి స్నాక్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. కావలసిన పోషకాలు కూడా అందుతాయి.
5) ప్రోటీన్ మూలం :
శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాల కోసం కూరగాయలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయినప్పటికీ మీ పిల్లల ఆహారంలో మీట్ ప్రాముఖ్యతను మీరు మర్చిపోకూడదు. ఇవి మీ పిల్లల ఆరోగ్యానికి ముఖ్యమైన ఐరన్, జింక్‌ని అందిస్తాయి. దీని వల్ల వారికి పౌష్ఠికాహారాన్ని అందించిన వారవుతాం.
Post a Comment