11 Benefits Of Apple Cider Vinegar For Health And Beauty in Telugu

11 Benefits Of Apple Cider Vinegar For Health And Beauty in Telugu : కారమైన వంటల్లో మరియు సలాడ్లలో ఉపయోగించే వినిగర్ ని చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మం మరియు కురుల పై ప్రభావితంగా పనిచేస్తుంది. వినిగర్ అసిడిక్ స్వభావం కలిగి ఉంటుంది. సరైన మార్గంలో ఉపయోగించినప్పుడు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మార్కెట్లో వివిధ రకాలైన వినిగర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంచుమించు అన్నీ ఒకే రకమైన ఫలితాలను అందిస్తాయి. కానీ చర్మం, జుట్టు మరియు శరీర సంరక్షణ విషయానికి వస్తే ప్రత్యేకించి ఆపిల్ సీడర్ వినిగర్ ను ఎంచుకోవటం మంచిది. ఎందుకంటే ఆపిల్ సీడర్ వినిగర్ లో ఎసిటిక్ ఆసిడ్ యొక్క గాఢత సమతుల్యంగా ఉంటుంది కనుక అధిక ప్రయోజనాలను అందిస్తుంది. వినిగర్ యొక్క అద్భుతమైన సౌందర్య లాభాల గురించి మరియు మీ రోజువారీ సౌందర్య సంరక్షణంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోడానికి ఈ వ్యాసం ని పూర్తిగా చదవండి.


11 Benefits Of Apple Cider Vinegar


స్కిన్ టోనింగ్ కొరకు వినిగర్ : చర్మాన్ని శుద్ది చేయటానికి, టోన్ చేయటానికి మరియు మాయిశ్చరైజ్ చేయటానికి ప్రతిరోజు టోనర్ ని ఉపయోగిస్తూ ఉంటాము. మీ రెగ్యులర్ టోనర్ కి బదులు వినిగర్ ని ఉపయోగించటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. కానీ ముఖ్యమైన విషయం – సరైన శాతంలో దీన్ని డైల్యూట్ చేయటం మరచిపోవద్దు. ఒక టేబుల్ స్పూన్ వినిగర్ ని 3 టేబుల్ స్పూన్లు తాజా నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పత్తిని ఉపయోగించి మీ ముఖం మీద రాయండి. ఒక టోనర్ లాగా మీ చర్మంపై ఈ నీటిని మృదువుగా అప్‌లై చేయండి. మీకు వాసన నచ్చకపోతే 5 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవచ్చు.

చర్మం పై మరకలు మచ్చలను (ఫ్రికల్స్) తొలగించేందుకు వినిగర్ : కొన్ని మచ్చలు శాశ్వతమని, తొలగించటం కష్టమని అంటారు. కానీ వాటిని తొలగించడంలో వినిగర్ సమర్థవంతంగా పని చేస్తుంది. చిన్న చిన్నగా ఉండే మచ్చలను తొలగించేందుకు అల్పా హైడ్రాక్సీ ఆసిడ్ పుష్కలంగా ఉండే ఆపిల్ సీడర్ వినిగర్‌ను ఉపయోగించండి. ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మ సౌందర్య ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఇది ఏజ్ స్పాట్స్ మరియు మచ్చల చికిత్సకు చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. ఈ ప్రయోజనం కోసం వినిగర్ ని డైల్యూట్ చేయకుండానే ఉపయోగించవచ్చు. ఒక ఇయర్ బడ్ సహాయంతో మచ్చలపై వినిగర్ ని రాయండి. మంచి ఫలితాల కోసం 4 నెలల పాటు ప్రతిరోజూ వినిగర్ ని రాయండి.

స్కిన్ సూతింగ్ కొరకు వినిగర్ : వినిగర్ లో ఆసిడ్ స్వభావం ఉంటుంది మరియు మన చర్మం కూడా కొద్దిగా యాసిడ్ pH కలిగి ఉంటుంది. కనుక, ఎర్రబడిన మరియు దురద చర్మం నుండి వినిగర్ చాలా సమర్థవంతంగా ఉపశమనాన్ని అందిస్తుంది. మీ శరీరం మీద సన్ బర్న్ ఉన్నట్లయితే మీరు స్నానం చేసే నీటిలో ఒక కప్పు వినిగర్ ని కలిపి 10-15 నిమిషాల పాటు ఆ నీటిలో శరీరాన్ని నానపెట్టండి. ఇది చర్మం యొక్క సహజ PH స్థాయులను తిరిగి పొందేందుకు సహాయపడుతుంది మరియు శరీరానికి ఉపశమనాన్ని అందిస్తుంది.

మొటిమలను తొలగించేందుకు వినిగర్ : ఆపిల్ సీడర్ వినిగర్ మాలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది మరియు ఇది వినిగర్ కి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను ఇస్తుంది. అందుకే మొటిమల చికిత్సలో వినిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం నుండి అదనపు జిడ్డును కూడా వినిగర్ తొలగిస్తుంది. రంధ్రాలను శుభ్ర పరుస్తుంది మరియు చర్మం యొక్క ph స్థాయులను బాలన్స్ చేస్తుంది. తద్వారా మొటిమల చికిత్సకు చాలా ప్రభావితంగా పనిచేస్తుంది.

రేజర్ గడ్డలకు వినిగర్ తో ఉత్తమ చికిత్స : మీరు రేజర్ ని ఉపయోగించిన తరువాత వాటి వలన కలిగిన గాయాలనుండి ఉపశమనం పొందేందుకు వినిగర్ ని ఉపయోగించవచ్చు. వినిగర్ లో యాంటీ ఇంఫ్లమ్మెటరి లక్షణాలు ఉన్నందున చర్మంపై కలిగిన రేజర్ గాయాలనుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది చర్మం యొక్క ph స్థాయులను బాలన్స్ చేసి రేజర్ బంప్స్ ని పూర్తిగా క్యూర్ చేస్తుంది. వినిగర్ లో అసిడిక్ నేచర్ ఉన్నందున ఇన్ గ్రోన్ హెయిర్ ని తొలగించటంలో కూడా సహాయపడుతుంది.

డాండ్రఫ్ చికిత్స కోసం వినిగర్ : డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆపిల్ సీడర్ వినిగర్ ని ఉపయోగించండి. ఇందులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నందున డాండ్రఫ్ ని పూర్తిగా తొలగిస్తుంది. వినిగర్ ని నీటిని సమాన మొత్తాల్లో కలిపి మాడు పై రాసి మసాజ్ చేయండి. మృదువుగా మసాజ్ చేసిన తరువాత 2 నిమిషాలు ఉంచి నీటితో కడగండి.

మాడు పై దురదను క్యూర్ చేసేందుకు వినిగర్ : స్కాల్ప్ పై దురద ఎంతో ఇబ్బంది పెడుతుంది. అంతే కాదు ఇది హెయిర్ ఫాల్ కి దారి తీస్తుంది. వినిగర్ యొక్క అసిడిక్ ph స్కాల్ప్ కు సహజ ph స్థాయులను అందించి ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. వినిగర్ ని డైల్యూట్ చేసి మాడు పై రాసి మసాజ్ చేయండి. ఆ తరువాత షాంపూ తో తల స్నానం చేయండి. ఇలా మొదట్లో వారానికి రెండు సార్లు ఆ తరువాత వారానికి ఒక సారి చేస్తూ ఉంటే మంచి ఫలితాలను పొందుతారు. దురద తగ్గుతుంది మరియు స్కాల్ప్ కూడా శుభ్రం అవుతుంది.

మృదువైన జుట్టు కొరకు వినిగర్ : మృదువైన మెరిసే జుట్టుని పొందేందుకు వినిగర్ ఒక ఉత్తమమైన సహజ పదార్థం. తల స్నానం చేసిన తరువాత ఒక టేబుల్ స్పూన్ వినిగర్ ని ఒక మగ్గు నీటిలో కలిపి ఆ నీటితో జుట్టుని కడగాలి. ఆ తరువాత తుడిచి ఆరపెట్టాలి. జుట్టు బాగా ఆరిపోయిన తరువాత వినిగర్ యొక్క వాసన కూడా పోతుంది మరియు జుట్టు మృదువుగా మెరుస్తూ అందంగా అవుతుంది.

పాదాల దుర్వాసనను తొలగించేందుకు వినిగర్ : ఎక్కువ గంటలు బూట్‌లను వేసుకునే అలవాటు ఉన్న వారి పాదాలు దుర్వాసన కలిగి ఉంటాయి. పాదాలలో ఏర్పడే చెమట చర్మపు రంధ్రాలలో పేరుకుపోవడమే ఇందుకు కారణం. మరి ఈ దుర్వాసనను తొలగించడానికి వినిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు వినిగర్ లో నాలుగు కప్పులు వెచ్చని నీరు కలిపి ఆ నీటిలో 15 నిమిషాల పాటు మీ పాదాలను నానపెట్టండి. రెగ్యులర్ గా ఇలా చేయటం వలన పాదాలలో దుర్వాసన పూర్తిగా పోతుంది.

ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ ని క్యూర్ చేసేందుకు వినిగర్ : కొంత పత్తి తీసుకుని డైల్యూట్ చేసిన ఆపిల్ సీడర్ వినిగర్ లో ముంచి ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ ఉన్న చోట అప్‌లై చేయండి. ఆపిల్ సీడర్ వినిగర్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.

బరువు తగ్గడానికి వినిగర్ : మీ బరువు తగ్గడానికి కూడా వినిగర్ సహాయపడుతుంది, ముఖ్యంగా ఆపిల్ సీడర్ వినిగర్. ఆపిల్ సీడర్ వినిగర్ లో అధిక మొత్తంలో పెక్టిన్ ఉంటుంది. ఇది మీ ఆకలిని సమర్థవంతంగా అణిచి వేస్తుంది. ఇందులో అసిడిక్ నేచర్ ఉండటం వలన జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది మరియు అదనపు కొవ్వును కరిగిస్తుంది.రెండు టేబుల్ స్పూన్ వినిగర్ ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ప్రతి పూట భోజనం ముందు త్రాగండి. ఇలా రోజుకు 3 సార్లు త్రాగటం వలన నెల రోజుల్లో మంచి ఫలితాలను పొందుతారు.

చర్మం, జుట్టు మరియు శరీర సంరక్షణ కోసం వినిగర్ ని ఉపయోగించేందుకు ముఖ్యమైన చిట్కాలు

  • చర్మం మరియు జుట్టు సంరక్షణ కోసం సింథటిక్ వినిగర్ కి బదులుగా ఆపిల్ సీడర్ వినిగర్ ని ఉపయోగించండి. ఆపిల్ సీడర్ వినిగర్ ని ఆపిల్ పండు యొక్క ఎక్సట్రాక్ట్స్ తో తయారు చేస్తారు కాబట్టి పండులోని పోషకాలు అందులో ఉంటాయి. సింథటిక్ వినిగర్ లతో పోల్చుకుంటే ఇందులో ఆసిడ్ నేచర్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి చర్మానికి ఎంతో సురక్షితమైనది.
  • అసిడిక్ నేచర్ తక్కువే అయినప్పటికీ మీ చర్మం, జుట్టు మరియు మాడు పై ఉపయోగించేటప్పుడు 50% నీటిలో డైల్యూట్ చేసి ఉపయోగించాలి. ఉపయోగానికి తగినట్టు టీ డికాషన్ లో కూడా డైల్యూట్ చేసుకోవచ్చు. వినిగర్ ని ఉపయోగించే ముందు డైల్యూట్ చేయటం చాలా ముఖ్యం.
మీకు సెన్సిటివ్ స్కిన్‌ ఉన్నట్లయితే వినిగర్ ని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. ముఖం పై రాసే ముందు చేతి పై ఒక చిన్న భాగంలో ఉపయోగించి చూడండి. ఎటువంటి మంటా, రెడ్నెస్ మరియు దురద కలగకపోతే ముఖంపై మరియు మాడు పై ఉపయోగించండి.


11 Benefits Of Apple Cider Vinegar For Health And Beauty

0/Post a Comment/Comments

Previous Post Next Post