ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటం కోసం…ఇలా చేయండి
ఈ ముద్రలో కనీసం ఐదునిమిషాల పాటూ ఉండాలి. దీన్ని వేయడం ఇన్‌ఫెక్షన్లు రావు . రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పరిఘాసనం: ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ల మీద లేచి నెమ్మదిగా ఎడమ కాలిని ఎడమవైపు నిటారుగా సాగ తీసి ఉంచాలి. ఇప్పుడు కుడి మోకాళ్లపై ఆధారపడి ఉండాలి. కుడి చేతిని కుడి మోకాలు ముందు పెట్టి ఎడమ చేతిని నిటారుగాపైకి ఎత్తి దానివైపే చూడాలి. ఈ ఆసనంలో అరనిమిషం నుంచి నిమిషం వరకూ ఉండాలి. ఇలాగే కుడి వైపు చేయాలి. ఇలా మార్చి మార్చి ఆరుసార్లు చేయాలి. దీనివల్ల నడుము పైభాగం ఆకృతి బాగుంటుంది.
గోముఖాసనం: ముందుగా నేల మీద కూర్చుని ఒక మోకాలు మీద ఇంకో మోకాలు వచ్చేట్టు కూర్చుని రెండు చేతులతో పాదాలని పట్టుకోవాలి. రెండు చేతులూ పక్కకి నిటారుగా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ చుబుకాన్ని మోకాలి మీద ఆనించి ఉంచాలి. శ్వాస మామూలుగా తీసుకుని వదులుతూ ఉండాలి. ఈ స్థితిలో అరనిమిషం నుంచి నిమిషం వరకూ ఉండాలి. ఇలా ఆరుసార్లు చేయాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది.
వ్యాఘ్రాసనం: ముందుగా వజ్రాసనంలో కూర్చుని చేతులు రెండూ ముందుకు పెట్టాలి. రెండు మోకాళ్లకూ మధ్య కొద్దిగా దూరం ఉంచి ఇప్పుడు ఎడమకాలిని మడిచి ఆ మోకాలిని సాధ్యమైనంత వరకూ పైకి లేపాలి. కుడిచేత్తో ఎడమకాలిని పట్టుకోవాలి. ముందుకు చూస్తూ ఉండాలి. ఇప్పుడు ధ్యాసంతా కింద పొట్టమీద ఉంచాలి. ఇదే విధంగా కుడికాలితోనూ చేయాలి. ఇలా చేసినప్పుడు కుడికాలిని ఎడమచేత్తో పట్టుకోవాలి. ఇలా మార్చిమార్చి ఆరు నుంచి పదిసార్లు చేయాలి. ఆ ఆసనం వల్ల ప్రసవానంతరం ఇబ్బందులు దూరమవుతాయి.
Post a Comment