Brinjal Bajji - How to Prepare Brinjal Bajji | Evening time snacks recipe

Brinjal Bajji  - How to Prepare Brinjal Bajji | Evening time snacks recipe: మిర్చి బజ్జి, అరటికాయ బజ్జి, బీరకాయబజ్జి అన్ని అందరికి తెలిసినవే.అందరు ఎక్కువగా బజ్జి అనగనే ఎక్కువగా మిర్చి లేదా అరటికాయతో చేస్తారు.కానీ వంకాయతో చేసే బజ్జి చాలా రుచిగా ఉంటుంది, చేయడం కూడా చాలా తేలిక. మాములు బారు వంకాయలైతే బాగుంటాయి.గుత్తి వంకాయలను వాడకండి అంత రుచిగా ఉండవు.

How to Prepare Brinjal Bajji

కావలసిన పదార్థాలు : 

వంకాయలు – 6
శెనగపిండి – 100గ్రా
బియ్యపిండి – 2స్పూన్స్
ఉప్పు, కారం – రుచికిసరిపడ
జీర – కొంచం
పల్లీలు – 3స్పూన్స్
ఉల్లిపాయలు – 2పెద్దవి
కొత్తిమీర తరుగు – కొంచం
నిమ్మకాయ – 1
చాట్ మసాలా – కొంచం
షోడా ఉప్పు – చిటికెడు
పసుపు – చిటికెడు
నూనె – డీప్ ఫ్రైకి సరిపడ

తయారి చేయు విధానం :

-ఒక చిన్న గిన్నెలోకి 2స్పూన్స్ శెనగపిండి, అందులో చిటికెడు ఉప్పు, కొంచం కారం, జీర కొంచం వేసి కలిపి చాలా కొంచం నీళ్ళు వేసి పేస్ట్ లా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఒక బౌల్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, వేయించిన పల్లీలు, కొత్తిమీర తరుగు, కొంచం కారం, కొంచం ఉప్పు, కొంచం చాట్ మసాలా పొడి నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
-ఒక బౌల్ లో మిగిలిన శెనగపిండి, బియ్యపిండి, చిటికెడు షోడాఉప్పు, జీర, రుచికిసరిపడ ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి అందులో కొంచం నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలిపి, అవసరమైతే మరి కొంచం నీళ్ళు వేసి మరీ పలుచగా కాకుండా అలా అని మరీ గట్టిగాను కాకుండా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి.
-స్టౌ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడ నూనె పోసి కాగనివ్వాలి.
-వంకాయలను మధ్యలోకి ఒక సారి కోసి అందులో మొదటగా చేసిన చిన్న గిన్నెలోని శెనగపిండి మిశ్రమాన్ని కొంచం వంకాయ లోపల రాసి తిరిగి వంకాయను గట్టిగా వత్తి, దానిని రెండో బౌల్ లో ఉన్న శెనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీయాలి.
-ఇలా కాలిన బజ్జీని మధ్యలో చీల్చి ఉల్లిపాయ పల్లీల మిశ్రమంపెట్టి పైన చిటికెడు చాట్ మసాలా చల్లి సర్వ్ చేయాలి.

How to Prepare Brinjal Bajji

Previous Post Next Post