డైటింగ్‌ చేస్తే మెదడు దెబ్బతింటుందా?

డైటింగ్‌ చేస్తే మెదడు దెబ్బతింటుందా? : బరువు తగ్గేందుకు డైటింగ్‌ చేస్తున్నారా? అయితే, మీ మెదడును మీరు బలహీనపర్చుకుంటున్నట్లే. డైటింగ్‌ పేరుతో ఆహారాన్ని తీసుకోవడం మానేస్తే కొద్ది కేలరీలు తగ్గినా మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఆహార అలవాట్లు మెదడు పనితీరును బాగా ప్రభావితం చేస్తాయి. డైటింగ్‌ జాప్ఞకశక్తిని బలహీనపరుస్తుంది. మెదడును తీవ్ర గందరగోళానికి, సమస్యలకు గురిచేస్తుంది. మెదడు చురుకుగా పనిచేయాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవడమే అసలైన మంత్రం.


డైటింగ్‌ చేస్తే మెదడు దెబ్బతింటుందా?


డైటింగ్‌ చేస్తే మెదడు దెబ్బతింటుందా?మెదడుకు పునరుత్తేజం కోసం మంచి నిద్ర కూడా అవసరం. స్వీట్లు, తెల్లని పదార్థాలు అంటే బియ్యం తదితర అత్యధిక గ్లూకోజ్‌ను రక్తంలోకి పంపించే ఆహారం కంటే ఫైబర్‌ ఎక్కువగా ఉండి కొవ్వు, ప్రోటీన్ల సమతుల్యతతో గ్లూకోజ్‌ను నెమ్మదిగా అందించే ఆహారాన్ని తీసుకోవడమే ఉత్తమం. జీర్ణవ్యవస్థ ప్రక్రియను అనుసరించే మెదడుకు శక్తి నిరంతరాయంగా అందుతూ ఉంటుంది. అందువల్ల మెదడును చురుకుగా ఉంచే ఆహారం తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఒమెగా 3 వంటి ఫాటీ యాసిడ్స్‌ ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. అంటే ఇవి ఎక్కువగా ఉండే చేపలను తీసుకోవాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post