గుండె పోటుకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి?

గుండె పోటుకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? : ఈ మధ్య కాలంలో గుండెపోటు బారినపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాగే, మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతోంది. అయితే, గుండెపోటు బారినపడకుండా ఉండేందుకు ఏం చేయాలన్న అంశంపై వైద్యులను అడిగితే…



గుండె పోటుకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి?


1) ఎక్కువగా కూర్చొని పనిచేసేవారు.. గంటకి ఒకసారి కుర్చీలో నుండి లేచి తిరగాలి. భోజనం తర్వాత కాసేపు బయట తిరగాలి. ఆహారంలో వేపుళ్లు, నూనెలు తగ్గించుకోవాలి. రోజులో ఎక్కువ సార్లు పండ్లు, కూరగాయలు, పీచు పదార్థంతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. బయటి భోజనాలు, హోటల్‌, చిరుతిళ్లు తగ్గిస్తేనే చాలా మంచిది. అధికంగా ఇంటి భోజనాకికే ప్రాధాన్యమివ్వాలి.

2)ఆరోగ్యకరమైన జీవన విధానం, చక్కని ఆహార అలవాట్లు, నిత్యం శారీరకవ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండటం వంటివ అలవాట్లను పాటించినట్టయితే గుండెజబ్బులు రాకుండా నివారించవచ్చని చెపుతున్నారు. అలాగే, బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌తో పాటు, టోటల్‌ బ్లడ్‌ పిక్చర్ కూడా తగిన మోతాదుల్లో ఉండేలా జాగ్రత్తపడాలి.

3)ముఖ్యంగా తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు శాతాన్ని తగ్గించుకోవాలి. అలాగే కారపు వస్తువులు, పచ్చళ్లు ఎక్కువ తినకూడదు. నెయ్యి, వెన్న, పామాయిల్ వాడకం తగ్గించాలి. గుడ్డులో పచ్చసొన తీనకూడదు. చిరుతిళ్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా స్థూలకాయం రాకుండా జాగ్రత్త పడాలి. రోజూ వ్యాయామం చెయ్యాలి. శరీరానికి రోజుకు గంట సేపు అయిన వ్యాయామం కలిగించాలి. రన్నింగ్, ఈత వంటివి చేయటం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి.

4)మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి చేయాలి. చక్కెర వ్యాధి బారినపడకుండా జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత వరకూ మద్యం, ధూమపానాలకు స్మోకింగ్‌లకు దూరంగా ఉండాలి. ఆరోగ్య అలవాట్లతో పాటు, చెడు అలవాట్లకు దూరంగా ఉండేవారిలో ఎక్కువ మందికి గుండె జబ్బులు దరి చేరడం లేదని తేలిసింది . రోజుకు కనీసం ఆరు నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఇవన్నీ విధిగా పాటించడంతో పాటు, ప్రశాంతమైన జీవనం గడపడం ద్వారా కూడా గుండె జబ్బుల్ని నివారించుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.




SHARE IT

0 Comments:

Post a Comment

Andhra Pradesh Districts

Andhra Pradesh Govt Schemes

Top