చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే - Sugar Cane Benefits

చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే - Sugar Cane Benefits: వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్ళతో పాటు చెరకు రసం ( cheraku rasam or sugarcane juice) త్రాగడానికి ఎక్కువ ప్రాదాన్యం ఇస్తుంటాం. ఈ రసంతో ఆరోగ్యానికి ఏంటో మేలు జరుగుతుంది.

వేసవి కాలంలో చాల మందిని డీహైడ్రేషాన్, ముత్రనాళ్ళ ఇన్ఫెక్షన్లు వేదిస్తుంటాయి. అలాంటివారికి చెరకు రసం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని చెడు క్రొవ్వులు దూరమవుతయి మరియు శరీరానికి సహజ చెక్కర్లు అందుతాయి. ఈ రసం జీవక్రియను వృద్ది చేస్తుంది. చెరకు రసాన్ని నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్ళతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.

చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే

చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే


చెరకు రసంతో వ్యాది నిరోధక శక్తి పెరిగి వ్యాదులకు దూరంగా ఉంటాం. కాలేయం శుభ్రపడి దాని పనితీరు మెరుగవుతుంది. పొట్టలో ఇన్ఫెక్షన్లు దరిచేరవు, జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.

గర్భిణి స్త్రీలకు చెరకు రసం చాలా మంచిది. ఇందులో ఇనుము, పోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గర్భస్థ శిశువుకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

చెరకు రసంలో వుండే పొటాషియం మలబద్దకాన్ని దూరం చేస్తుంది. దంత సంబంధిత సమస్యలు తగ్గించి నోటి దుర్వాసనలు రాకుండా చేస్తుంది.

ఇందులో యాంటి ఆక్షిడేంట్లు అధికంగా వుండటం వలన అవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. వ్రుధాప్య ఛాయల్ని అడ్డుకుంటాయి.

గొంతు మంట, ఇన్ఫెక్షన్ ఉన్నవారు చెరకు రసం ఎంత త్రాగితే అంత మంచిది. ఇందిలోని సహజ చెక్కెరలు సమస్యని దూరం చేస్తాయి.

మరిన్ని ఆరోగ్య చిట్కాలు కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post